ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరగబోయే బిఆర్ఎస్ సభ ను సక్సెస్ చేయాలి – మంత్రి ఇంద్రక‌ర‌ణ్

బిఆర్ఎస్ పార్టీని దేశ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గా ఖమ్మం లో తొలి సభ నిర్వహించడం..ఆ సభ భారీ సక్సెస్ కావడం తో ఇతర చోట్ల ఫై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 05 న మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభ ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలనీ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కార్య కర్తలకు పిలుపునిచ్చారు. నాందేడ్‌ సభ సన్నాహకాల్లో భాగంగా శనివారం కిన్వట్ తాలూకాలోని అప్పారావు పేట‌ గ్రామంలో మంత్రి ప‌ర్యటించి, బీఆర్ఎస్ పార్టీ మ‌ద్ధతుదారులను కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా పార్టీ లక్ష్యాలను మహరాష్ట్రవాసులకు వివరించేందుకు బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ తో క‌లిసి న‌డిచేందుకు ముందుకు రావాలని కోరారు. అలాగే సభకు ముందు నాందేడ్ లోని సిక్కుల ప‌విత్ర స్థలం గురుద్వార్ ను సీఎం కేసీఆర్ ద‌ర్శించుకుంటార‌ని మంత్రి వెల్లడించారు.