నేడు మరోసారి భేటీ కానున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ

ఢిల్లీ లో ఈరోజు కూడా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కాబోతుంది. మరో నాల్గు , ఐదు నెలల్లో తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుంది. ఎలాగైనా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చూస్తుంది. రీసెంట్ గా ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించి ప్రజల్లో ఆసక్తి రేపిన కాంగ్రెస్..ఇప్పుడు బస్సు యాత్ర తో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతుంది. అంతకంటే ముందు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాలని చూస్తుంది. ఇప్పటీకే అధికార పార్టీ బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధం అకావడం తో..కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నెలకరికల్లా ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేయాలనీ చూస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థుల తాలూకా దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.

బుధువారం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ మొదలుకాగా..లోక్‌సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ కారణంగా అర్థాంతరంగా సమావేశం నిలిచిపోయింది. నిన్న సుమారు రెండున్నర గంటల పాటు అభ్యర్థులపై కసరత్తు చేశారు. గురువారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ రోజు సమావేశంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కిరానుంది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ సహా సభ్యులుగా ఉన్న ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటింగ్ వెళ్లడంతో నిన్న సమావేశం నిలిచిపోయింది.