పుదుచ్చేరిలో కుప్పకూలిన ప్రభుత్వం

రాజీనామా లేఖతో రాజ్ భవన్ కు పయనం..!

పుదుచ్చేరి: పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. పుదుచ్చేరి అసెంబ్లీలో జరిగిన బల నిరూపణలో వి. నారాయణ స్వామి ఓడిపోయారు. దీంతో దాదాపు నాలుగున్నర ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. బల నిరూపణలో ఓటమి చెందగానే, తన రాజీనామా లేఖతో నారాయణ స్వామి రాజ్ భవన్ కు పయనం అయ్యారు. తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరి తాత్కాలిక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె ప్రస్తుతం పుదుచ్చేరి రాజ్ భవన్ లోనే ఉన్నారు. మరికాసేపట్లో ఆమెను కలవనున్న నారాయణ స్వామి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఆపై అసెంబ్లీలో ఇతర పార్టీల బలాబలాలను, న్యాయ నిపుణుల సలహాలను స్వీకరించిన తర్వాత గవర్నర్ తమిళిసై, తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/