సినీ పరిశ్రమ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించాలని యోచన

‘వైల్డ్ డాగ్’ మూవీ ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి వెల్లడి

Chiranjeevi, Nagarjuna at a media conference
Chiranjeevi, Nagarjuna at a media conference

Hyderabad: సినీ పరిశ్రమ కార్మికులకు సీసీసీ ఫండ్ తో కరోనా వాక్సినేషన్ అంధించేందుకుకు కృషి చేస్తామని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ , సీసీసీ నిధితో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నామని అన్నారు. వైల్డ్ డాగ్ మూవీ ప్రెస్ మీట్లో మెగా స్టార్ మాట్లాడారు

ఇదిలావుండగా కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ;వైల్డ్ డాగ్గు ‘ గురించి ఆయన మాట్లాడుతూ.. ప్ర‌తీ స‌న్నివేశం ఉత్కంఠ‌ను క‌లిగించింద‌ని, వైల్డ్ డాగ్ చిత్రాన్ని ప్ర‌తీ ఒక్క‌రు చూడాల‌ని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం యూనిట్ ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ నటుడు నాగార్జున తదితరులు మాట్లాడారు.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/