వారు తక్షణమే రాజీనామా చేయాలి

భూ అక్రమణ ఆరోపణలపై స్పంందించిన రేవంత్‌ రెడ్డి

Revanth reddy
Revanth reddy

హైదరాబాద్‌: గోపన్నపల్లి భూ అక్రమణల ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించడం అధికార పార్టీ తీరని, కానీ తనపై ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభం కలుగుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. గోపన్న‌పల్లి భూ ఆక్రమణల ఆరోపణలపై ఆయన ఈరోజు స్పందించారు. పనిచేయని ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తామని కేటీఆర్‌ చెబుతున్నారని, మరి ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌, కేటీఆర్‌లను ఏం చేయాలని ప్రశ్నించారు. వారు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/