శ్రీవారి సేవలో మంత్రి తలసాని

తిరుపతి: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి కళ్యాణోత్సవ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో మంత్రి తలసానిని సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల తలసాని మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిగత నిర్ణయమని దీనిపై తానేమి స్పందించనని అన్నారు. ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని.. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం తగదని పేర్కొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/