పులుకుర్తిలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

పులుకుర్తి: వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన 30మందికి పైగా కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీలలో ఉండలేక, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరినవారిలో దండు రవి,దండు చంద్రమౌళి,దండు ఆగయ్య, కొత్త రామచందర్,దండు రామచందర్, తదితరులు ఉన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/