ప్రధాని రామగుండంపై పర్యటనపై పొన్నం విమర్శలు

Ponnam Prabhakar
Ponnam Prabhakar

హైదరాబాద్ః కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామగుండంపై పర్యటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘నువ్వేం పొడిచావని రామగుండం వస్తున్నావు నరేంద్ర మోడీజీ. 1980లో కాంగ్రెస్ హయాంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాని బిజెపి ప్రభుత్వం 1999 మూసింది. మళ్ళీ 2014లో అప్పటి తెలంగాణ ప్రాంత ఎంపీల చొరవతో ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం’’ అంటూ పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/