హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ భారీ విజయం

congress

సిమ్లాః హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే మ్యాజిక్‌ ఫిగర్‌ (35)ను దాటేసి 36 స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. బిజెపి 23 స్థానాల్లో గెలిచి, రెండుస్థానాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల ఇతరులు గెలుపొందారు. అయితే, ఈ ఎన్నికల్లోనూ హిమాచల్‌ప్రదేశ్‌ ఓటర్లు ఆనవాయితీగా మరోసారి కొనసాగించారు.

ఒకసారి అధికారాన్ని సాధించిన పార్టీ మరోసారి విజయాన్ని అందుకున్న దాఖలలు లేవు. ఈ సారి ఎన్నికల్లో అధికార బిజెపిని గద్దె దింపి.. హస్తం పార్టీకి ఓటర్లు పట్టం కట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా వీరభద్రసింగ్‌ మాట్లాడుతూ ప్రజలకు ఆదేశం ఇచ్చారని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. గెలిచిన అభ్యర్థులు తమ వెంటే ఉంటారని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆమె.. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/