సిఎం సహాయ నిధికి సినీ ప్రముఖుల విరాళాలు

tollywood-celebrities-contribution-to-telangana-CM-relief-fund

హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ లో‌ చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి  అండగా టాలీవుడ్‌ సినీ పరిశ్రమ స్టార్‌ ముందుకోచ్చారు. సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు చిరంజీవి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. మహేశ్‌బాబు కోటి రూపాయలను తన వంతు సాయంగా అందించటానికి ముందుకు వచ్చారు. నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్‌ రూ.50 లక్షలను విరాళంగా ప్రకటించారు. హీరో రామ్ రూ.25 లక్షల సాయాన్ని ప్రకటించారు. అలాగే హీరో విజయ్‌ దేవరకొండ పది లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నానని తెలిపారు. హారిక హాసిని బ్యానర్‌తో పాటు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కలిసి తలో పది లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి కూడా తన వంతు ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయలను అందించనున్నట్లు తెలిపారు. అలాగే డైరెక్టర్ హరీశ్ శంకర్ ఐదు లక్షల రూపాయలను, బండ్ల గణేష్ రూ.5లక్షల విరాళాన్ని అందిస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/