ఏపీలో రాజకీయ పార్టీలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలన్నీ రంగులు మారుస్తాయి. అప్పటివరకు కలివిడిగా ఉన్న పార్టీల నేతలు ఒక్కసారిగా బద్ద శత్రువులుగా మారతారు. ఒకరిపై ఒకరు దూషణలు , వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పరువులు తీసుకుంటారు. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీలో ఎన్నికల కాకమొదలైంది. నువ్వా..నేనా అనేంతగా అధికార – ప్రతిపక్ష పార్టీలు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ – టీడీపీ మధ్య భీకర యుద్ధం నడుస్తుంది.

ఎక్కడ కూడా ఎవ్వరు తగ్గట్లే..పోటీపోటీగా సభలు , సమావేశాలు , నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు , ప్రచారం ఇలా ఇరు పార్టీలు దూకుడు కనపరుస్తున్నాయి. తాజాగా టీడీపీ ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో , వైసీపీ ‘సిద్ధం’ సభల పేరుతో ప్రచారం చేస్తుండగా ..వైసీపీ నేతలు ఏకంగా కండోమ్ ప్యాకెట్లను కూడా వదిలిపెట్టకుండా వాటిపై ప్రచారం చేస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు నీచంగా పోస్టులు పెట్టుకోవడం చూసి నెటిజన్లు ఛీ కొడుతూ..రాజకీయాల కోసం ఎంత దిగజారుతారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.