ఉపాధి నిచ్చే కంప్యూటర్‌ కోర్సులు

Computer courses for employment

ఇంటర్మీడియట్‌ తర్వాత అనేక కోర్సులు ఉన్నప్పటికీ కంప్యూటర్‌ సంబంధిత కోర్సులకు ఉన్నంత క్రేజ్‌ మరి దేనికి ఉండదు. ఈ మధ్య ఈ క్రేజ్‌ కొంచెం తగ్గినప్పటికీ అవి ఎవర్‌ గ్రీన్‌ కోర్సులుగానే పరిగణింపబడతాయి. అయితే అసలు ఇంటర్‌ తర్వాత ఈకోర్సుల స్వభావం ఎలా ఉంటుంది. మొత్తం ఎన్ని కోర్సులు ఉంటాయి అనే విషయాలు ఒక్కసారి చూద్దాం.

సాధారణ డిగ్రీ కోర్సులైన బి.కాం, బిఎస్‌సిలలో కంప్యూటర్‌ సమ్మిళిత కోర్సులు ఉంటాయి. అవే బి.కామ్‌ కంప్యూటర్స్‌, బి.ఎస్‌సి కంప్యూటర్‌. ఈ కోర్సులలో ప్రాథమిక అంశాలైన ఎం.ఎస్‌ ఆఫీస్‌తో పాటు ఏవైనా రెండు ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజీలను నేర్పిస్తారు. వీటితో పాటుగా ఇంటర్నెట్‌ వాడటం లాంటి అంశాలు కూడా ఉంటాయి. అయితే ఒక విద్యార్థి తన డిగ్రీ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఇవి మాత్రమే సరిపోవు.. వీటికి సమాంతరంగా విద్యార్థులు మరికొన్ని కంప్యూటర్‌ ఆధారిత అప్లికేషన్స్‌లను నేర్చు కోవాల్సి ఉంటుంది.

బి.కాం విద్యార్థులైతే తప్ప నిసరిగా అకౌంటింగ్‌ ప్యాకేజీ, ట్యాలీ లాంటివాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. మిగతా విద్యార్థులైతే జావా, ఒరాకిల్‌ లాంటి అధునాత ప్రోగ్రాంలతో పాటు డిటిపిని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సాధారణ డిగ్రీ విద్యార్థులు కూడా బహుళ జాతి కంపెనీల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగా లను పొందగలరు. ఆ తర్వాత కంప్యూటర్‌ అప్లికేషన్‌ ఎక్కువగా ఉండే కోర్సు ఇంజనీరింగ్‌.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/