జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్షకు సన్నద్ధం

CAREER
CAREER

జూనియర్‌ లైన్‌మెన్‌ పేపర్‌-ఎ ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ కోర్‌ సబ్జెక్టుకు సంబంధించినది. ఇందులో ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీలు, మాగ్నటిజం, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎసి, బెసిక్‌ ఎలక్ట్రానిక్‌, డిసి మెషిన్స్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌,ఎసి మెషిన్స్‌, ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్‌, ఎలక్ట్రిక్‌ పవర్‌ జనరేషన్‌ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. మొదట ప్రాథమిక ఫార్ములాలను క్షుణ్ణంగా చదవాలి. ఐటిఐ విద్యావిధానంలో ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటువది. ఈ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన విషయ పరిజ్ఞానం ఈ పరీక్షలో ఎంతో ముఖ్యం. లైన్‌మెన్‌కు మెజ రింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై అవగాహన ఉండాలి. ఏ పరికరం ఎలాంటి సూచనలు ఇస్తుంది. ఎక్కడ ఉపయోగించాలి అనేవాటిపై ప్రశ్నలు ఉండవచ్చు

.జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి ఆనలిటికల్‌, న్యూమరికల్‌ ఎబిలిటి, కరెంట్‌ ఆఫైర్స్‌, కన్స్యూమర్‌ రిలేషన్స్‌, నిత్యజీ వితంలో జనరల్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల ఇష్యూ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, భారత తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యాలపై ప్రశ్నలు వస్తాయి. కరెంట్‌ ఆఫైన్స్‌లో ప్రాంతీయ జాతీ య అంతర్జాతీయ వర్తమానఅంశాలుంటాయి.

వార్తపత్రికల పఠ నం సన్నద్ధతలో భాగమని గుర్తించాలి. హైదరాబాద్‌ మెట్రో,టీ హబ్‌, గ్లోబల్‌ ఆంత్ర ప్రెన్యూర్‌షిప్‌ విశేషాలు ప్రశ్నలు గా రావోచ్చు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సాదించిన విజయాలు, అవార్డులు, ప్రభుత్వ విధానాలు, తెలంగాణలో జరిగిన సదస్సులు, సమా వేశాలపై దృష్టిపె ట్టాలి.తెలంగాణలో ప్రాచీన కట్టడాలు, వాస్తుశైలి, ముఖ్యమైన జాతరలు, పండుగలు, కొండజాతుల సంప్రదాయాలు, కళలపైఅవగాహన పెంచుకోవాలి.

కాకతీయు కాలం లోసమాజం, కళ లు.వాస్తుశైలి. వేములవాడ, చాళుక్యులు, నిజాంలు, కుతుబ్‌ షాహీల కళలు, సాహిత్యం, వాస్తుశైలినుంచి ఎక్కువ ప్రశ్నలు ఆశించవచ్చు. తెలంగాణ ఉద్యమ తీరుతె న్నులు, నూతన రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేయాలి. ఉద్యమ నేతలు, ఆకాలంలో ఆల పించిన గేయాలు, రచనలు, సంస్థలు ముఖ్యం. తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే ఎక్కువ ఉపమోగకరం.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/