ఐపిఒలకు కంపెనీల తహతహ
ఆకర్షిస్తున్న స్టాక్‌మార్కెట్లు

ముంబై,: ఇటీవల భారీ లాభాలతో దూసుకెళుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు పలు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఐపిఒ ద్వారా నిధులు సమీకరించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. తద్వారా స్టాక్ ఎక్ఛేంజీల్లో మెరుగైన లిస్టింగ్‌ను సాధించాలనీ చూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియచేశాయి.
పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు ఇటీవల పలు కంపెనీలు సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి.
జాబితాలో రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బర్గర్ కింగ్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా ఆర్ఇఐటి, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, కళ్యాణ్ జ్యుయెల్లర్స్ తదితరాలున్నాయి.
పలు కంపెనీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు లభించడంతో రానున్న ఆరు వారాల్లోగా ఐపిఒ మార్కెట్ జోరందుకునే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఈ నెలలో మార్కెటల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ ఏకంగా 10శాతం ర్యాలీ చేసింది. ఇందుకు కేవలం 8 ట్రేడింగ్ సెషన్లు మాత్రమే తీసుకోవడం విశేషం.
ఇటీవల మార్కెట్లు జోరుచూపడంతో మార్చి కనిష్టాల నుంచి 70శాతం పురోగమించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/