చిన్నారి సర్జరీకి అయ్యే ఖర్చు భర్తిస్తా
ప్రముఖ నటుడు సోనూసూద్ ట్వీట్

Hyderabad: నాలుగు నెలల చిన్నారిని ఆదుకునేందుకు ప్రముఖ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు.
గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 4నెలల చిన్నారికి ఆపరేషన్ చేయించటానికి ఏర్పాట్లు చేస్తున్నానని వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లె గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల నాలుగు నెలల కుమారుడు అద్విత్ శౌర్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
ఆ చిన్నారి వైద్యానికి రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని, ఇందుకోసం సాయం చేయాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకున్నారు.
ఈ విషయాన్ని నెటిజన్స్ కొందరు తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది సోనూసూద్ చెంతకు చేరింది.
వెంటనే స్పందించిన ఆయన సర్జరీకి అయ్యే ఖర్చు తాను భర్తిస్తానని చెబుతూ.. హైదరాబాద్‌లోని ఇన్నోవా హాస్పిటల్‌లో ఆపరేషన్‌కు ఏర్పాటు చేశాం అని ట్వీట్‌లో తెలిపారు.
ఈ ఆపరేషన్ గురించి డాక్టర్ కోన సాంబమూర్తి చెప్పారని సోనూ అన్నారు. కాగా, గ్రామస్థులు చిన్నారి కోసం రూ.40 వేలు సాయం చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/