అమ్మకాలకే ఇన్వెస్టర్ల ప్రాధాన్యత

ఎనిమిది రోజుల లాభాలకు బ్రేక్‌!

Investor preference for sales
Investor preference for sales

ముంబై,: మార్కెట్లలో ఎనిమిది రోజుల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. గురువారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్ల ర్యాలీకి బ్రేక్‌ పడింది.

సెన్సెక్స్‌ చివరికి 236పాయింట్లు పడిపోయి 43,357వద్ద నిలిచింది. నవంబరులో ఇప్పటివరకూ సెన్సెక్స్‌ ఏకంగా 10 శాతం ర్యాలీ చేయడం విశేషం.

నిఫ్టీ కూడా 58పాయింట్లు పడిపోయి 12,691వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 43,544పాయింట్ల వద్ద గరిష్టానికి చేరగా, 43,128దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ కూడా 12,741-12,625పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

ఎన్‌ఎస్‌ఇలో ముఖ్యంగా బ్యాంకింగ్‌ రెండు శాతం నష్టపోగా, ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ, మీడియా, ఆటో, ఫార్మా 1.3శాతం నుంచి 0.3శాతం మధ్య పెరిగాయి.

నిఫ్టీ దిగ్గజాలలో ఎస్‌బిఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, కోల్‌ ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, ఎన్‌టిపిసి, ఐసిఐసిఐ, యాక్సిస్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యుపిఎల్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 3నుంచి 1.2శాతం మధ్య నష్టపోయాయి.

అయితే హెచ్‌యుఎల్‌, గ్రాసిమ్‌ ఇండియా, శ్రీ సిమెంట్‌, హిండాల్కో, ఐటిసి, ఎల్‌అండ్‌టి, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.3శాతం నుంచి ఒక శాతం మధ్య పుంజుకున్నాయి.

ఐబి హౌసింగ్‌, కమిన్స్‌, బాలకృష్ణ, ఎక్సైడ్‌, నౌకరీ, చోళమండలం, అరబిందో ఫార్మా 8నుంచి 3.6శాతం మధ్య పెరిగాయి.

అపోలో హాస్పిటల్స్‌, బిఒబి, ఎస్‌బిఐ, బాష్‌ టాటాపవర్‌ వంటి షేర్లు 4నుంచి 2.7శాతం మధ్య నష్టపోయాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/