కోన‌సీమ జిల్లా .. డాక్ట‌ర్‌. బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మార్పు

త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్న ప్ర‌భుత్వం

అమరావతి: ఏపీలో ఇటీవ‌లే 13 కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా అమ‌లాపురం కేంద్రంగా ఏర్పాటైన కొత్త జిల్లా కోన‌సీమ జిల్లా పేరును మార్పు దిశ‌గా ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ జిల్లా పేరును డాక్ట‌ర్‌. బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మార్చేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

కొత్త జిల్లాల‌కు సంబంధించి క‌స‌ర‌త్తు మొద‌లైన నాటి నుంచి కూడా కోనసీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరుపెట్టాల‌ని ద‌ళిత సంఘాలు, ప్ర‌జా సంఘాలు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ డిమాండ్ కోసం ఆయా సంఘాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు కూడా దిగింది. అయితే నాడు ఈ నిర‌స‌న‌ల‌ను అంత‌గా ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం… తాజాగా జిల్లా పేరును మార్చేందుకు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/