కల్నల్ సంతోష్‌బాబు అస్తికల నిమజ్జనం

నల్లగొండ: భారత్, చైనా ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అస్తికలను కుటుంబ సభ్యులు శనివారం నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణ, మూసి నదుల సంగమంలో తండ్రి ఉపేందర్, భార్య సంతోషి, కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో సంతోష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు నమస్కారం చేశారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు అస్తికలుంచిన వాహనం దామరచర్ల గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు ఆ వాహనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కల్నల్ సంతోష్‌బాబు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/