పాకిస్థాన్‌ రహస్య డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్‌

సరిహద్దులో ఫొటోలు తీస్తున్న డ్రోన్

పాకిస్థాన్‌ రహస్య డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్‌
BSF shoots down Pakistani spy drone

కశ్మీర్‌: భారత సరిహద్దు వ‌ద్ద విహ‌రిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన నిఘా డ్రోన్‌ను .. బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ ద‌ళాలు కూల్చివేశాయి. కథువా జిల్లా హీరానగర్ సెక్టార్, రథువా వద్ద ఈ ఉదయం పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ ఎగురుతూ కనిపించింది. రహస్యంగా అది ఫొటోలు తీస్తున్నట్టు గుర్తించిన బీఎస్ఎఫ్ 19 బెటాలియన్ జవాన్లు దానిపై 8 రౌండ్ల కాల్పులు జరిపి కూల్చివేశారు. సరిహద్దులో రహస్యంగా ఫొటోలు చిత్రీకరించేందుకే పాక్ దానిని పంపించి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇవాళ ఉద‌యం 5.10 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. భార‌త్ వైపున ఉన్న అంత‌ర్జాతీయ బోర్డ‌ర్‌కు 250 మీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/