నేడు ఇడుపులపాయకు సిఎం జగన్‌

రేపు వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించనున్న జగన్‌

CM Jagan visit AP secretariat
CM Jagan

అమరావతి: సిఎం జగన్‌ ఈరోజు ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఇడుపులపాయలో జరగనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో జగన్‌ పాల్గొంటారు. రేపు ఉదయం 9.45 గంటలకు వైఎస్‌ఆర్‌ ఘాట్ వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పిస్తారు. అనంతరం జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జగన్ తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/