మరికాసేపట్లో అధికారిక నివాసానికి ప్రణబ్ పార్థివదేహం

తొలి అంజలి ఘటించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్

Pranab Mukherjee

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రణబ్ పార్థీవ దేహాన్ని రాజాజీమార్గ్‌లోని అధికారిక నివాసానికి తరలించనున్నారు. తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ నేతలతో సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించనున్నారు. ఆ తరువాత 11 గంటల నుంచి 12 గంటల వరకు సాధారణ ప్రజల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు సైనిక గౌరవ వందనం సమర్పించనున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. 2 గంటలకు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో ప్రణబ్ ముఖర్జీకి అంతిమ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/