విజయకాంత్‌ కు భౌతికకాయానికి నివాళులర్పించిన సిఎం స్టాలిన్‌

CM Stalin condoles demise of ‘Captain’ Vijayakanth

చెన్నైః తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్‌ తమిళ స్టార్‌ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ కు నివాళులర్పించారు. చెన్నైలోని విరుగంబాక్కంలోని నటుడి నివాసానికి చేరుకున్న సీఎం.. కెప్టెన్‌ భౌతికకాయంపై పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్‌ వెల్లడించారు.

కెప్టెన్‌ విజయకాంత్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్లు. కెప్టెన్‌ మృతివార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. మరోవైపు విజయకాంత్‌ మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి తరలించారు.