చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్‌కల్యాణ్ – కొడాలి నాని

చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్‌కల్యాణ్ - కొడాలి నాని

గత నాల్గు రోజులుగా వైసీపీ VS పవన్ కళ్యాణ్ మాటల యుద్ధం నడుస్తుంది. ఓ మూవీ ఫంక్షన్ లో వైసీపీ నాయకుల ఫై పవన్ చేసిన కామెంట్స్ ఫై వారంతా నిప్పులు చెరుగుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు పవన్ ఫై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి నాని తనదైన స్టయిల్ లో పవన్ కళ్యాణ్ ఫై కౌంటర్లు వేశారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ జీవితంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించలేరని అన్నారు. జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకోవాలని నాని ఎద్దేవాచేశారు.

‘‘2024 లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా చూసుకుందాం. పవన్ ఏంటి మమ్మల్ని భయపెట్టేది. ఇంకో జానీ సినిమా చూపించి భయపెడతాడా. పవన్‌ను చూసి ఆయన అభిమానులు భయపడతారు. జగన్మోహన్‌రెడ్డి ఆ నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే భయపడలేదు. నీవెంటి ఆయనను భయపెట్టేది. పవన్ ప్రసంగాలకు జనం భయపడతారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదివి మమ్మల్ని భయపెడతాడా. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్‌కల్యాణ్’’ అని కొడాలి నాని కామెంట్స్ చేసారు.