సినీ నటి సౌజన్య ఆత్మహత్య

చిత్రసీమలో వరుస మరణాలు ఇండస్ట్రీ వ్యక్తులను , అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. అనారోగ్యం కారణంగా కొంతమంది మరణిస్తుంటే..మరికొంతమంది మాత్రం ఆత్మహత్య లు చేసుకుంటూ తనువు చాలిస్తున్నారు. తాజాగా కన్నడ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. యువనటి సౌజన్య ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

శాండల్‌వుడ్‌లు పలు చిత్రాల్లో, సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల అభిమానం చొరగొన్న ఈమె.. బెంగళూరులో కుంబల్‌గోడు‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్న ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్ గది నుండి దుర్వాసన రావడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని బలవంతంగా తెరిచి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది.

ఇక, సౌజన్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె సహచరులను, కుటుంబ సభ్యులను నుంచి మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె మృతదేహం వద్ద నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సెప్టెంబర్ 27న రాసినట్టుగా దానిపై ఉన్న డేట్‌ను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితమే ఆమె ప్రాణాలు తీసుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.