రేపు పీవీ శత జయంతి ఉత్సవాలపై సిఎం సమీక్ష

TS CM Kcr
TS CM Kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే కేశవరావు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉన్నది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/