రైతులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను

రైతులకు కౌలు చెల్లించి ఆదుకోవలసిన అవసరం ఉంది

రైతులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను
Somu veerraju

అమరావతి: ఏపికి రాజధాని గా అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు రావలసిన కౌలు మొత్తం అడిగేందుకు న్యాయం కోసం సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చిన రైతులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానని బిజెపి ఏపి గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ సకాలంలో వార్షిక కౌలు చెల్లించాలని ఆయన తెలిపారు. 28 వేల మందికిపైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం సీఆర్డీయే రైతులతో చేసుకొన్న ఒప్పందం ఎకరాకీ ప్రతి ఏటా రూ.3 వేలు మెట్టకీ, రూ.5 వేలు పెంచాల్సి ఉందని తెలిపారు. కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రిని కోరారు.

బిజెపి కూడా ప్రభుత్వానికి మానవీయ కోణంలో ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసిందని సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచాయని అందువలన రైతులు రొడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. న్యాయం కోసం వచ్చినవారిపై నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ,ఇంకా ఎవరినైనా విడుదల చేయకపోతే వెంటనే విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని సోము వీర్రాజు కోరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/