నేడు అమిత్‌ షా తో కెసిఆర్ సమావేశం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ లో సీఎం కెసిఆర్ పర్యటన కొనసాగుతున్నది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం కెసిఆర్ ఈరోజు కేంద్ర‌ హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను కలువనున్నారు. అమిత్ షాతో ఈ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు భేటీ కానున్నారు. ఈ స‌మావేశంలో అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. ప‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ వినతిపత్రం సమర్పించనున్నారు.

కాగా, సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్రవారం ప్రధాని న‌రేంద్ర‌మోడీతో సమావేశమై యాదాద్రి దేవ‌స్థానం పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/sports/