కొల్లాపూర్‌కు పర్యటనకు వెళ్లిన సిఎం కెసిఆర్‌

CM KCR visited Kolhapur

హైద‌రాబాద్ : నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌కు సిఎం కెసిఆర్‌ ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బ‌య‌ల్దేరారు. రోడ్డు మార్గాన కెసిఆర్‌ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగ‌ర్‌క‌ర్నూల్‌లోని తేజ గార్డెన్స్‎కు చేరుకోని.. అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2:30కు తేజ గార్డెన్ నుంచి రోడ్డు మార్గాన మూడున్నరకు నార్లాపూర్ కంట్రోల్ రూమ్‎కు చేరుకుంటారు. అనంతరం కంట్రోల్‌ రూమ్‌లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్‌ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోల్లాపూర్‎లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్‎లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి ప్రగతి భవన్‎కు చేరుకుంటారు.