కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువస్తున్న నాయకుడు సిఎం కెసిఆర్: కవిత

CM KCR, the leader who is bringing the former glory of caste professions: Kavita

నిజామాబాద్‌ : కంటేశ్వర్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. కుల వృత్తులు పూర్వ వైభవం వం తీసుకువస్తున్న నాయకుడు సిఎం కెసిఆర్‌. ఎన్నికల నగారా నిన్ననే మోగింది. మొట్టమొదటి సమావేశం గౌడ కుల బాంధవులతో జరురుకోవటం సంతోంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశారు. కానీ కెసిఆర్ ఆనాడే ఉద్యమ సమయంలో చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అయితే గౌడ కులస్తులకు అండగా ఉంటాం అన్నారు.

అలాంటి కులవృత్తులను పునరుద్ధరించేందుకు సిఎం కెసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గీత కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే సిఎం కెసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం పాలసీగా తీసుకొని ఈత వనాలని పెంచుతున్నది. మద్యం టెండర్లలో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నం.

గత ప్రభుత్వాల కాలంలో నిజామాబాద్ నుంచి ఎంతో మంది పెద్ద నాయకులు పనిచేశారు. జిల్లాకు ఒకటే బీసీ హాస్టల్ ఉండేది. అలాంటిది ఈరోజు 15 బీసీ హాస్టల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది బీసీ బిడ్డలకు ఫీజు రింయంబర్స్ మెంట్ ఇస్తున్నాం.

తెలంగాణలోఉన్నది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదు, బీసీల ప్రభుత్వం అన్నారు. ఎన్నికలప్పుడు అనేక పార్టీలు వస్తాయి. వారిని నిలదీయండి. బీఆర్‌ఎస్‌ పార్టీగా పని చేశాం కాబట్టి హక్కుగా ప్రజల వద్దకు వస్తున్నాం. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 3 తర్వాత మళ్లీ ఏర్పడేది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.