దుబ్బాకలో ప్రారంభమైన ఉప ఎన్నికల కౌంటింగ్‌

మధ్యాహ్నం మూడు గంటలకల్లా పూర్తి ఫలితం

దుబ్బాకలో ప్రారంభమైన ఉప ఎన్నికల కౌంటింగ్‌
dubbaka-vote-counting-begins

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం ప్రారంభమైంది. 12 గంటలలోగా తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 315 పోలింగ్‌ బూతుల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్‌ శాతం నమోదైంది. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది.
కాగా సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 315 పోలింగ్‌ బూతుల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్‌ శాతం నమోదైంది. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది.

కాగా, ప్రతి టేబుల్‌ను ఓ మైక్రో అబ్జర్వర్స్‌తోపాటు మిగతా అధికారులు పర్యవేక్షించనున్నారు. టేబుళ్ల వద్ద జరిగే లెక్కింపు పర్యవేక్షణ బాధ్యతలను ఏఆర్వోలకు అప్పగించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపును తాసిల్దార్‌, ఎంపీడీఓ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో  కౌంటింగ్‌ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. 357 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. సిద్దిపేట పట్టణంలో కౌంటింగ్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాల్లో పికెట్స్‌, టియర్‌ గ్యాస్‌ బృందాలు, కౌంటింగ్‌ కేంద్రం, పరిసర ప్రాంతాల్లో రూఫ్‌ టాప్‌ అబ్జర్వేషన్‌ బృందాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. 

ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వారు, కరోనా బాదితులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించారు. 1,453 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అలాగే, మొత్తంగా 1,64,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/