నగరంలో స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి బిఆర్‌ఎస్‌ మద్దతు

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్ః హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతు పలికింది. గతంలో మాదిరిగా తమకే సీటు కేటాయించి, మద్దతు ఇవ్వాలని ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తిపై సీఎం కెసిఆర్‌ సానుకూలంగా స్పందించారు. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు పలకాలని నిర్ణయించారు.