అవసరమైతే టీవీ చానల్ నడపాలంటూ ఆదేశించిన సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి పార్టీ శ్రేణులే టీవీ ప్రకటనలు, ఫిల్మ్ ప్రొడక్షన్ చేపట్టవచ్చని, అవసరమైతే టీవీ చానల్ నడపాలంటూ పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్న బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో అనేక అంశాల గురించి చర్చించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు గెలుపు కోసం ఎంతలా కష్టపడాలి దిశానిర్దేశం చేసారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. మెరుగైన పని తీరు కనబర్చిన వారికే ఈసారి ఎన్నికల్లో టికెట్లు అని వెల్లడించారు. పార్టీ కోసం అవసరమైతే టీవీ చానల్ నడపాలని సీఎం కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి పార్టీ శ్రేణులే టీవీ ప్రకటనలు, ఫిల్మ్ ప్రొడక్షన్ చేపట్టవచ్చని వివరించారు. ప్రజలతో మాస్ కమ్యూనికేషన్ పెంచుకోవాలని, ప్రభుత్వ పథకాలను భారీ ఎత్తున ప్రచారం చేయాలని ఆదేశించారు.