ఎమ్మెల్యే భౌతికకాయానికి నివాళులర్పించిన సిఎం

cm kcr

సిద్దిపేట: సిఎం కెసిఆర్‌ జిల్లాలోని దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చేరుకొని ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతికకాయానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సిఎం కెసిఆర్ కన్నీటి పర్యంతమైయ్యారు. సోలిపేట కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. మరికాసేపట్లో రామలింగారెడ్డి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/