ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పెరుగుతున్న రోగులు
మద్యం లేక వింతగా ప్రవర్తిస్తున్న జనాలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్ విధించారు. దీని కారణంగా రాష్ట్రంలో పూర్తిగా మద్యం నిషేదించారు. ఇది మద్యం ప్రియులకు శాపంగా మారింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో కొందరు వ్యక్తుల మానసికంగా వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత వారం రోజులుగా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి కి రోగుల సంఖ్య భారిగా పెరిగింది. కేవలం వారం రోజల్లోనే 1000 కి పైగా కేసలు నమోదు అయ్యాయి అని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమాశంకర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/