మూడు రాజధానుల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం

చంద్రబాబు తప్పు చేయకపోతే ఎందుకు వణికిపోతున్నారు

mla roja
mla roja

కర్నూల్‌: మూడు రాజధానుల ద్వారా అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే రోజా అన్నారు. నేడు ఆమె శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ..భవిష్కత్తు అంతా జగనే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని అన్నారు. గత ఐదేళ్లు తప్పు చేయకపోతే ఎందుకు చంద్రబాబు వణికిపోతున్నారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తనయుడు లోకేష్‌, చంద్రబాబు కేబినెట్‌లో అందరూ జైలుకెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రోజా పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/