పట్టాభి అరెస్ట్ కేసు : ఇద్దరు పోలీసులపై వేటు వేసిన కోర్ట్

తెలుగుదేశం నేత పట్టాభి అరెస్ట్ కేసు లో కోర్ట్ ఇద్దరు పోలీసుల ఫై వేటు వేసింది. ప‌ట్టాభిని అరెస్ట్ చేసిన స‌మ‌యంలో ఖాళీల‌తో నోటీసులు ఇవ్వ‌డంపై మెజిస్ట్రేట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి..విజ‌య‌వాడ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో విధులు నిర్వ‌హిస్తున్న ఏసీపీ ర‌మేష్, సీఐ నాగ‌రాజులపై వేటు వేసింది. ఏసీపీ ర‌మేష్ ను డీజీపీ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించారు. అంతే కాకుండా సీఐ నాగ‌రాజును ఏలూరు డీజీపీకి రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించారు.

వైసీపీ సర్కార్ ఫై , అలాగే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసారని పోలీసులు పలు సెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ తర్వాత ఆయన బెయిల్ ఫై బయటకొచ్చారు. ప్రస్తుతం పట్టాభి తన ఫ్యామిలీ తో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లారు. ప్రశాంతత కోసం విహారయాత్రకు వెళ్దామని ఆయనను భార్య చందన కోరినట్టు సమాచారం. భార్య కోరిక మేరకు పట్టాభి మాల్దీవులకు వెళ్లారట .