కృష్ణ జిల్లాలో టీడీపీ – వైస్సార్సీపీ నేతల మధ్య గొడవ

TDP, YSRCP
TDP, YSRCP

కృష్ణ జిల్లాలో టీడీపీ – వైస్సార్సీపీ నేతల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం వైస్సార్సీపీ , జనసేన, టీడీపీ పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. 175 కి 175 గెలిచి తీరాలని జగన్ అంటుంటే..ఒక్క ఛాన్స్ అంటూ పవన్ అంటున్నాడు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు..ఈసారి టీడీపీ ని గెలిపించకపోతే రాజకీయాల నుండి తప్పకుండా అని ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు. ఇలా ఎవరికీ వారు ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

కాగా టీడీపీ ఇప్పటికే పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తుంది. తాజాగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పెనమలూరు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, అభివృద్ధి చేయలేదంటూ ఫ్లెక్సీల రూపంలో ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో యనమలకుదురు బ్రిడ్జిపై టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ కార్యక్రమాన్ని వైస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ నేతల మీదకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ మాజీ ఎంపీ బోడె ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్లను వెంటనే అక్కడి నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.