జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలోని తారా ఇండస్ట్రీస్‌లో ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. రియాక్టర్లకు చార్జింగ్ పెడుతుండగా ఈ పేలుడు సంభవించడంతో మంటలు అంటుకున్నాయి. మూడు కిల్లో మీటర్ల మేర దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదం గమనించిన సిబ్బంది వేంటనే బయటకు పరుగు తీయండతో పెను ప్రమదం తప్పింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిసున్నారు. కానీ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపుచేయడం కష్టంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/