మరోసారి మెగా స్టార్ తన గొప్ప మనసు చాటుకున్నారు

మరోసారి మెగా స్టార్ తన గొప్ప మనసు చాటుకున్నారు
chiranjeevi-about-allu-ramalingaiah

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కాన్సర్ తో బాధపడుతున్న అభిమానికి అండగా నిలిచారు. అభిమాని వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు ను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

విశాఖ జిల్లాకు చెందిన వెంకట్ అనే వ్యక్తి..చిన్నప్పటి నుండి మెగాస్టార్ కు వీరాభిమాని. చిరంజీవి పేరిట పలు సేవ కార్యక్రమాలు చేస్తూ మెగా అభిమానాన్ని చాటుకుంటుంటారు. అయితే గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మెగాస్టార్ దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో మెగాస్టార్ వెంకట్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకురావాలని చెప్పారు. అంతే కాకుండా పూర్తిగా వైద్య ఖర్చులు తానే భరిస్తానని మెగాస్టార్ హామీ ఇచ్చారు. దాంతో వెంకట్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మెగాస్టార్ తన అభిమానులు కష్టాల్లో ఉన్న సందర్భాల్లో ఆదుకున్నారు. కరోనా సమయంలో కూడా సొంత ఖర్చు తో ఆక్సిజన్ ను తెలుగు రాష్ట్రాల్లోని హాస్పటల్స్ కు అందజేసి వారి ప్రాణాలు కాపాడారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే..త్వరలో ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే సెట్స్ ఫై మూడు సినిమాలను ఉంచాడు.