రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు అలీ..

సినీ నటుడు , ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుడు అలీ..మంగళవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని కలిశారు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన అలీ.. ఆయన్ను కలిశారు. అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఇటీవలే నిశ్చయమైంది. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను రేవంత్ రెడ్డి కి ఇచ్చేందుకు వెళ్లినట్లు తెలుస్తుంది. మెడిసిన్ పూర్తి చేసిన ఫాతిమా ఎంగేజ్మెంట్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. షేక్ షెహ్యాజ్ అనే వ్యక్తితో ఫాతిమా పెళ్లి త్వరలో జరగనుంది. షేక్ షెహ్యాజ్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.

ఇక అలీ విషయానికి వస్తే రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం అలీని ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియమించింది. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా అలీ తన బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.