ఆయన సృష్టించిన చరిత్రను భవిష్యత్తులో ఏవరూ సృష్టించలేరు

అమరావతి: దివంగత ముఖమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని  సోమవారం టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని కొనియాడారు. ఆయన సృష్టించిన చరిత్రను భవిష్యత్తులో ఎవరూ సృష్టించలేరని అన్నారు. నందమూరి తారకరామారావు పేరు ఒక్కసారి చూస్తే.. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ అని పిలుచుకుంటారని, ఆ పేరు వినగానే శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/