చరణ్ బర్త్ డే : తనయుడికి ప్రేమగా ముద్దు పెడుతున్న మెగాస్టార్

ఆర్ఆర్ఆర్ తో మెగా పవర్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్. ఇప్పుడు చరణ్ అంత గ్లోబల్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. అలాంటి గ్లోబల్ స్టార్ ఈరోజు 38 వ ఏటా అడుగుపెట్టాడు. ఈ సందర్బంగా అభిమానులు , సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు ఆయనకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందజేస్తున్నారు. ఇక మెగా అభిమానులైతే నిన్నటి నుండే మెగా సంబరాలు మొదలుపెట్టారు. పలు సేవ కార్యక్రమాలు చేపట్టి వారి అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు.

ఇదిలా ఉంటె మెగాస్టార్ చిరంజీవి తనయుడికి ప్రేమగా ముద్దు పెడుతున్న పిక్ పోస్ట్ చేసి అభిమానుల్లో మరింత జోష్ నింపారు. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా.. అతడిపై చెంపపై తాను ప్రేమగా ముద్దు పెట్టుకున్న ఫొటోను మెగాస్టార్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు ‘ప్రౌడ్ ఆఫ్ యు నాన్న.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఈ పిక్ చూస్తుంటే.. చరణ్ సాధించిన విజయాలకు తండ్రిగా మెగాస్టార్ ఎంతగా పొంగిపోతున్నాడో అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా.. తండ్రీ కొడుకుల ప్రేమానురాగాలు చూసి నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.