సిద్ధిపేట్ జిల్లా క‌లెక్ట‌ర్ కు.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్..?

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. రీసెంట్ గా హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తి అవ్వగా..ఇప్పుడు రాష్ట్రంలోని 12 స్థానాలకు సంబదించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే దీని తాలూకా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెరాస విజయ డంఖా మోగిస్తుందని అంత భావిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక బిజీ గా ఉన్నారు. ఇప్పటికే పలువురి పేర్లు బయటకు రాగా..తాజాగా మరో ఆసక్తికర పేరు చక్కర్లు కొడుతుంది.

సిద్ధిపేట్ జిల్లా క‌లెక్ట‌ర్ గా విధులు నిర్వ‌హిస్తున్న వెంక‌ట్రామి రెడ్డి కి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెంక‌ట్రామి రెడ్డి పలుసార్లు అధికార పార్టీ కి మ‌ద్ధ‌త్తు గా మాట్లాడి వార్తల్లో నిలిచారు. ముఖ్యం గా ఒక కార్య క్ర‌మంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కాళ్లు ను పాదాభివంద‌నం చేసాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెంక‌ట్రామి రెడ్డి పేరు వినిపించింది. అలాగే ఇటీవ‌ల వ‌రి విత్త‌నాల అమ్మ‌కం విష‌యం లో కూడా వెంక‌ట్రామి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య లు చేశాడు. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టి లో ప‌డ్డాడు.ఈ క్రమంలో వెంక‌ట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ టీకెటు ఇవ్వ‌డానికి కేసీఆర్ కూడా సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. టికెట్ వ‌స్తే త‌ప్ప‌కుండా ఎమ్మెల్సీ గా పోటీ చేస్తానని వెంక‌ట్రామి రెడ్డి అంటున్నార‌ని స‌మాచారం.