చిరంజీవిని ఇంటర్వ్యూ చేయబోతున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ , మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అంతేకాదు చిరంజీవిని బాలకృష్ణ పలు ప్రశ్నలు అడగబోతున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలియంది కాదు. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యాయి. ఇకఇప్పుడు మూడో సీజన్ ను మొదలుపెట్టబోతున్నారు.

చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు అగ్ర రాజకీయ, సినీ తారలను ఇంటర్వ్యూ చేసిన బాలకృష్ణ..ఇక ఇప్పుడు మూడో సీజన్ మెగాస్టార్ చిరంజీవి తో మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపిస్తే ఇక ప్రేక్షకులకు పండగే అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒకవేళ చిరంజీవి ఈ షోకు హాజరైతే… ఆయనకు బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? ఎలాంటి సరికొత్త విషయాలను ఆయనతో చెప్పిస్తారు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.