క్రాక్ డైరెక్టర్ కు బాలకృష్ణ వార్నింగ్

నందమూరి బాలకృష్ణ అఖండ తో భారీ విజయం అందుకున్నాడు. బోయపాటి శ్రీను తో సినిమా చేస్తే అది హిట్టే అని మరోసారి నిరూపించాడు. ఈ సినిమా ఇప్పటికే రూ.67 కోట్ల షేర్ వసూలు చేసింది. తద్వారా దాదాపు 14 కోట్ల లాభాలు డిస్ట్రిబ్యూటర్లకు అందించింది. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన అద్భుతమైన విషయం కావడంతో బాలకృష్ణ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో క్రాక్ ఫేమ్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు బాలకృష్ణ. క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకొని గోపీచంద్ మలినేని మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు బాలకృష్ణ కూడా అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటె తాజాగా రవితేజతో కలిసి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న unstoppable షోకు గెస్ట్ గా వచ్చాడు గోపీచంద్. అక్కడికి వచ్చిన ఈ దర్శకుడిని చూసి నాకు హిట్ ఇవ్వకపోతే చంపేస్తా అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య. తన టాక్ షోకి వచ్చిన అతిథులతో బాలకృష్ణ ఉంటున్న తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు. తన ఇమేజ్ కూడా పక్కనపెట్టి చిన్నపిల్లాడిలా అందరితో సరదాగా కలిసి మెలిసి ఉండడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదే షో లో రవితేజ – బాలకృష్ణ ల మధ్య నడుస్తున్న ఓ వార్త కు ఫుల్ స్టాప్ పడింది.

. ‘నీకు నాకు పెద్ద గొడవ అయ్యిందటగా ముందు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వు’ అని రవితేజను బాలకృష్ణ అడగ్గా.. ‘పనీపాట లేని డ్యాష్‌ గాల్లకు ఇదే పని’ అంటూ ఘాటు రియాక్షన్ ఇచ్చారు రవితేజ. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదని క్లారిటీ వచ్చింది.