భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం : చైనా రాయబారి

india- china

బీజింగ్‌ః భారత్‌పై టైం దొరికిన ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా ఇప్పుడు కొత్త రాగం పాడుతోంది. ఇండియాతో కలిసి పని చేయాలని తమకు ఆసక్తిగా ఉందంటూ చైనా రాయబారి ఒకరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా టెన్షన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆసియా క్రీడల్లో భాగంగా కొందరు భారత ఆటగాళ్లకు చైనా వీసాలతోపాటు అక్రిడిటేషన్‌ నిరాకరించడంపై ఇరు దేశాల మధ్య మరోసారి వివాదం మొదలైంది. చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడిందని భారత్ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై కోల్‌కతాలోని చైనా రాయబారి ఝా లియూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌-చైనాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని అన్నారు. ‘ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల నాయకులు చర్చించి ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు తమ దేశం సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచ అభివృద్ధి, శాంతి కోసం భారత్‌ సహా పొరుగు దేశాలతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని ఝూ లియూ తెలిపారు.