పద్మ నదిలో బోటు మునక : 26 మంది మృతి
ఘటనపై విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం
బంగ్లాదేశ్లో పద్మ నదిలో వేగంగా వెళుతున్న ఓ బోటు తిరగబడిన ఘటనలో 26 మంది మృతి చెందారు. అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మదారిపూర్ జిల్లాలో జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న పడవను ఇసుక తీసుకెళ్లే బోటు ఢీకొన్నాయి. దీంతో అందులోని 26 మంది నదిలో మునిగి మృతి చెందారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రజలు ఎక్కడం వల్ల ప్రమాదం జరిగిందని అక్కడి పోలీసులు తెలిపారు. మొత్తం 26 మృతదేహాలను నీటి నుంచి వెలికి తీశారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/