ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఇంటర్నెంట్ నెట్​వర్క్​ను ఆవిష్కరించిన చైనా

China launches the world’s fastest internet.. Incredible connection can transfer 150 high-definition movies every SECOND

బీజింగ్‌ః ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ ఉంది. టెక్నాలజీలో తరచూ ఏదో సంచలనం సృష్టించే చైనా ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చైనా కంపెనీలు తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఇంటర్నెంట్ నెట్​వర్క్​ను ఆవిష్కరించాయి. ఈ నెట్‌వర్క్‌ సెకనుకు 1.2 టెరాబైట్స్‌ వేగంతో డేటాను ట్రాన్స్‌మిట్‌ చేయగలదట. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రధాన ఇంటర్నెట్‌ రూట్స్ కంటే ఇది దాదాపు 10 రెట్లు వేగంగా పనిచేస్తోందట. సౌత్ చైనా పోస్టు పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. సింగ్వా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్‌, హువావే టెక్నాలజీస్‌, సెర్నెట్‌ కార్పొరేషన్‌ సమష్టిగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయట. ఒక్క సెకనులో 150 సినిమాలు డౌన్​లోడ్ చేసుకోవచ్చు. అది కూడా హెచ్​డీ మూవీస్.. భవిష్యత్​లో మరింత వేగమైన నెట్​వర్క్​ను రూపొందించేందుకు ప్రయత్నిస్తామని.. హువావే టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వాంగ్‌ లీ తెలిపారు.

కాగా, ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇంటర్నెట్‌ టెక్నాలజీ అత్యధికంగా సెకనుకు 100 జీబీ డాటాను మాత్రమే మార్పిడి చేయగలదు. ఇటీవల అమెరికా సెకనుకు 400 జీబీ డాటాను మార్పిడి చేయగల నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో పోల్చితే చైనా నెట్‌వర్క్‌ నాలుగింతలు. ఈ నెట్‌వర్క్‌ నిర్మాణం కోసం చైనా పదేండ్లుగా పరిశోధన చేస్తున్నది. ఈ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను బీజింగ్‌, వుహాన్‌, గాంగ్‌ఝౌ మధ్య 3000 కిలోమీటర్ల పొడవున ఏర్పాటుచేశారు. సింఝువా యూనివర్సిటీ, హువావే టెక్నాలజీస్‌, సెర్నెట్‌ కార్పొరేషన్‌ కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది.