భార‌తీయ విమానాల‌పై ఆంక్ష‌లు పొడిగింపు

బ్యాన్‌ను ఆగ‌స్టు 21వ తేదీ వ‌ర‌కు పొడిగించిన కెన‌డా

ఒట్టావా: కెన‌డా భార‌తీయ విమానాల‌పై ఆంక్ష‌ల‌ను మరో సారి పొడిగించింది. ఆగ‌స్టు 21వ తేదీ వ‌ర‌కు భార‌త‌దేశం నుంచి వ‌స్తున్న విమానాల‌పై స‌స్పెన్ష‌న్ విధించిన‌ట్లు కెన‌డా ప్ర‌భుత్వం తాజాగా పేర్కొన్న‌ది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో విమాన ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు అమ‌లు అవుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న కార‌ణంగా విమాన ప్ర‌యాణాల‌పై మ‌ళ్లీ ఆంక్ష‌లను పొడిగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇండియా, పాక్ నుంచి వెళ్లే విమానాల‌పై కెన‌డా బ్యాన్ విధించింది. ప్యాసింజ‌ర్‌, బిజినెస్ విమానాల‌ను ర‌ద్దు చేశారు. అయితే ఆగ‌స్టు నుంచి పూర్తిగా వ్యాక్సినేట్ అయిన వారికి అనుమ‌తి క‌ల్పించ‌నున్న‌ట్లు కెన‌డా చెప్పింది.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/videos/