షూటింగ్ లో గాయపడిన హీరోయిన్ టబు

సీనియర్ హీరోయిన్ టబు ..షూటింగ్ లో గాయపడింది. తెలుగు తో పాటు పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె..ప్రస్తుతం అజయ్ దేవగన్ కు జోడిగా “భోలా” సినిమాలో నటిస్తుంది. కాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ క్రమంలో ఈమె షూటింగ్ లో ప్రమాదానికి గురైంది. ఒక ఫైట్ సీన్ కోసం స్టెంట్ చేస్తూ ఉండగా గాయపడినట్లు తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో టబు నుదుటిపై అలాగే కంటిపైన గాయమైందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. చేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ట్రక్కు అద్దాలు పగిలిపోవడంతో టబు నుదుటిపైనా, కంటికి దగ్గరగా గాయాలయ్యాయి. అయితే కంటికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన టబును యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

ఇక టబు విషయానికి వస్తే..హైదరాబాదులో పుట్టి ముంబైలో స్థిరపడింది టబు. కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది. టబు అసలు పేరు తబుస్సుమ్ హష్మి. 1971 నవంబరు 4న హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి జమాల్ అలీ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె తల్లి ఒక పాఠశాల అధ్యాపకురాలు. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకొంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది. నిన్నటితరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబుకి బంధువు అవుతారు.